తన కుటుంబంలో ఎనిమిది మందికి కొవిడ్​ సోకినట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి గోవింద్​ కర్జోల్  వెల్లడించారు. తన కుమారుని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రంలోని బాగల్​కోట్​, కలబుర్గి జిల్లాల్లో పర్యటించలేకపోతున్నట్లు పేర్కొన్నారు.ఉపముఖ్యమంత్రిగా సేవలందిస్తోన్న కర్జోల్​ బాగల్​కోట్ లోని ముధోల్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కలబుర్గి, బాగల్​కోట్​ జిల్లాలకు ఇన్​చార్జి మంత్రిగా కూడా ఉన్నారు. అయితే వరదల వల్ల ఈ రెండు జిల్లాల్లో భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది.


నా కుటుంబంలో ఎనిమిది మందికి కొవిడ్​ సోకింది. కరోనా కారణంగా నా కుమారుడు 23 రోజులుగా వెంటిలేటర్​పైనే ఉన్నాడు. నా భార్య ఈ మధ్యనే కోలుకుని ఆసుపత్రి నుంచి వచ్చారు. 19 రోజుల చికిత్స తరువాత నాకు కొంత ఉపశమనంగా ఉంది అని గోవింద్​ కర్జోల్ అన్నారు.వైద్యుల సలహా మేరకు బాధిత ప్రాంతాల్లో పర్యటించలేకపోతున్నట్లు కర్జోల్​ తెలిపారు. అయితే ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పరిస్థితిని సమీక్షిస్తునట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: