మహిళా మంత్రిని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కమల్​నాథ్ తన పార్టీకి చెందినవారైనప్పటికీ.. వ్యక్తిగతంగా అలాంటి భాష ఉపయోగించడాన్ని ఇష్టపడనని అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరు చేసినా ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు.

అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కమల్​నాథ్ పేర్కొన్నారు. ఏ సందర్భంలో ఆ మాట అనాల్సి వచ్చిందో ఇప్పటికే స్పష్టంగా చెప్పానని అన్నారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని, అలాంటప్పుడు క్షమాపణలు ఎందుకు అడగాలని ప్రశ్నించారు. ఇప్పటికే తాను విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు.అంతకుముందు, తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు కమల్​నాథ్. మంత్రి పేరు గుర్తు రాకపోవడం వల్లే 'ఐటం' అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: