రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​ వీ కొవిడ్​ టీకాను 100 మంది భారతీయ వలంటీర్లపై ప్రయోగించనున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) తెలిపింది. ఈ మేరకు దిగ్గజ ఔషధ తయారీ సంస్థ డాక్టర్​ రెడ్డీస్​ లేబొరెటరీస్​కు పరీక్షలు నిర్వహించే అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఎప్పుడు టెస్టులు నిర్వహించాలనే అంశంపై డాక్టర్​ రెడ్డీస్ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఫేస్​-2 క్లినికల్ టెస్టుల నిర్వహణ​ జరిపాకే డా.రెడ్డీస్​.. మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తుందని స్పుత్నిక్​ అధికారికంగా ప్రకటించింది.


రష్యా వ్యాక్సిన్​ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని డాక్టర్​ రెడ్డీస్ సంస్థ​ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈమేరకు, అక్టోబర్​ 5న రెడ్డీస్​ సంస్థ లేఖపై నిపుణులు(సబ్జెక్ట్ ఎక్స్​పర్ట్ కమిటీ) తీవ్రంగా చర్చించారు. వ్యాక్సిన్​ ప్రయోగం పూర్తి వివరాలను మరోసారి ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత క్లినికల్​ ట్రయల్స్ విషయమై.. అక్టోబర్​ 13న ఔషధ తయారీ సంస్థ మరోసారి ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: