ఇటీవల కాలంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అది కాస్తా డ్రగ్స్ వైపు మళ్లడం దానికి సంబంధించి వివిధ సెలబ్రెటీలు కేసులో ఇరుక్కోవడం వంటివి ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు చుట్టూ తిరిగినన్ని మెలికలు అన్నీ ఇన్నీ కాదు. సుశాంత్ కేసులో అతని సిస్టర్స్ పై రియా చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఎఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సరికాదని సీబీఐ తెలిపింది.

ఇది చట్టప్రకారం సరైనది కాదని బాంబే హైకోర్టుకు వెళ్ళింది సి.బి.ఐ.  ఆ సిస్టర్స్ పై రియా ఆరోపణలు అంతా కట్టుకథల ఉన్నాయని, అసలు దీనికి సంబంధించిన దర్యాప్తు తమకు చెందినదని సిబిఐ అధికారులు తెలిపారు. సుశాంత్ మృతికి సంబంధించి ముంబై పోలీసులవద్ద గానీ, రియా వద్ద గానీ సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని వారు అన్నారు. అంతే తప్ప బాంద్రా పోలీసు స్టేషన్ లో సుశాంత్ సిస్టర్స్ మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు సిబిఐ అధికారులు. తమపై పెట్టిన కేసును కొట్టివేయాలన్న సుశాంత్ సిస్టర్స్ ప్రియాంక సింగ్, మీతూ సింగ్ అభ్యర్థనను వారు సమర్థించారు.

 అయితే సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ కేసులో ఇరుక్కోవడం వల్ల తనకు సమాజంలో చెడ్డ పేరు వచ్చిందని రియా తమ్ముడు పేర్కొన్న డు. అందువల్ల ప్రియా సుశాంత్ పై కోపంతోనే తన సిస్టర్స్ ని కేసులో లాగుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కూడా కేసులో ఇరుక్కొని కొన్ని రోజుల పాటు మీడియాలో లో విపరీతమైన హాట్ టాపిక్ గా నిలిచింది తర్వాత రకుల్ పేరు ఇందులో లేదని మళ్లీ కొట్టిపారేసింది. ఈ విధంగా రియా తనకు తోచినట్టుగా ఎవరి పేర్లు పడితే వారి పేర్లు చెబుతోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: