కన్నడ, మలయాళ, సినిమాల్లో తన అందచందాలతో హావభావాలతో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగిస్తున్న నటి మాళవిక మోహనన్. ఇప్పుడు తమిళ సినీరంగంలోనూ తనదైన జెండా పాతేస్తుందనే చెప్పాలి. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ విజయ్ '‘మాస్టర్'’ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన ఈభామ. తాజాగా ధనుష్ 43వ చిత్రంలోనూ నటించనున్నట్టు ఆ చిత్రబృందం తెలిపింది.

ధనుష్ 43వ సినిమాకు హీరోయిన్‌గా అందాల భామ మాళవిక ఓకే చెప్పింది. సత్యజోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై టి.జి. త్యాగరాజన్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తుండగా.. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అయితే మాళవికకు గ్రాండ్ వెల్‌కమ్ అంటూ ఆ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ను పెట్టింది. ఇప్పటి వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా కాదన్న మాళవిక.. సినిమాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. ఆఖరికి ధనుష్‌తో సినిమాను ఓకే చేసింది. ఇప్పుడు తమిళ్‌లో స్టార్ హీరోల సరసన నటించనున్న ఈ అందాల తార తమిళ సినీరంగంలోనూ సత్తా చాటాలని ఎదురుచూస్తోందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: