హైదరబాద్ లో ఎన్నికల ప్రచారలతో గత పది రోజులు హోరెత్తించాయి ప్రముఖ పార్టీలు.ఆదివారంతో ఎన్నికల ప్రచారానికి తెర పడింది.నువ్వా నేనా అన్నట్లుగా ప్రముఖ పార్టీలు గెలుపు కోసం పోటీ పడుతున్నాయి.బల్దియా పీఠాన్ని మళ్ళీ దక్కించుకోవాలని టి‌ఆర్‌ఎస్ చూస్తుంటే,దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి అనూహ్యంగా బలం పుంజుకుని రెట్టింపు ఉత్సాహంతో బల్దియా పీఠాన్ని ఈ సరైన దక్కించుకోవాలని చూస్తుంది బి‌జే‌పి పార్టీ.

మరి పోలింగ్ కు ఉదయం 6 నుండి ప్రారంభం కానున్న నేపద్యంలో ఇరు పార్టీలలో టెంక్షన్ వాతావరణం నెలకొంది. అయితే నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఒక హోటల్‌కు వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను గుర్తించి  టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు.దీంతో బండి సంజయ్ వర్గానికి టి‌ఆర్‌ఎస్ కార్యకర్తలకు మద్య వాదన జరిగింది.

 ఆయనతో పాటుగా ఎక్కువ మంది ఉండటంతో ఇరు వర్గాల మద్య గర్షణ చోటుచేసుకుంది. సంజయ్‌ కారును టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరువర్గాలు మద్య  పోటాపోటీ నినాదాలు చెయ్యడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని బండి సంజయ్‌ను వేరొక కారు గుండా పంపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: