విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు కంటితుడుపు చ‌ర్య‌లేన‌ని, పుర‌పాల‌క సంఘ ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు ఆడుతున్న డ్రామాలంటూ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మండిప‌డ్డారు. అధికార పార్టీకి 22మంది ఎంపీలున్నార‌ని, వారంతా విశాఖ ఉక్కు ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పార్ల‌మెంటులో త‌మ వాణిని వినిపించాల‌ని, అది చేయ‌కుండా రాష్ట్రంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లంటూ నాట‌కాలాడుతుంటే న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లెవ‌రూ లేర‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఒక్క విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని దృష్టిలో పెట్టుకొని ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌తిపాద‌న తీసుకురాలేద‌ని, దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌డ‌ప‌డంలో ఉన్న ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పుడు భూములిచ్చిన రైతుల కుటుంబాలు ఇప్ప‌టికీ ప‌రిహారం కోసం పోరాడుతున్నాయ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు గుర్తుచేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వానికి విశాఖ ఉక్కు నిద‌ర్శ‌న‌మ‌ని, ఆత్మ‌బ‌లిదానాల త్యాగాల‌ ఫ‌లితంగానే విశాఖ ఉక్కు ఏర్ప‌డింద‌ని, దీనిపై పున‌రాలోచ‌న చేయాలంటూ అమిత్‌షాకు వివ‌రించిన‌ట్లు ప‌వ‌న్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: