ఏలూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఏలూరు కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఓట‌ర్ల జాబితా అంశంలో దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన ఉన్న‌త న్యాయ‌స్థానం ఎన్నిక‌లు ఆపాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది.
అంత‌కుముందు జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు సంబందించి దాఖ‌లైన పిటిష‌న్‌పై కూడా హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. గ‌త సంవ‌త్స‌రం జ‌రిగిన నామినేష‌న్ల ప్ర‌క్రియ‌లో బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌లు, బెదిరింపులు జ‌రిగాయ‌ని జ‌న‌సేన పార్టీ ఆరోపిస్తోంది. కొత్త నోటిఫికేష‌న్ విడుద‌ల‌పై ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించాల‌ని కోరుతూ ఆ పార్టీ కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస‌రావు కోర్టును ఆశ్ర‌యించారు. తుది విచార‌ణ జ‌రిపిన ఉన్న‌త న్యాయ‌స్థానం తీర్పును రిజ‌ర్వులో ఉంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: