ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్ లో జ‌రిగిన కుంభ‌మేళా దేశం మొత్తానికి క‌రోనా హాట్‌స్పాట్‌గా మారింది. ఐదురోజుల వ్య‌వ‌ధిలో అక్క‌డ 1701 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 10 నుంచి 14వ తేదీ వ‌ర‌కు 2 ల‌క్ష‌ల 36వేల మందికి పైగా క‌రోనా ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా 1701 మందికి పాజిటివ్‌గా తేలింద‌ని అధికారులు వెల్ల‌డించారు. భ‌క్తులు, సాధువుల‌కు అంద‌రికీ ఆర్టీపీసీఆర్‌, ర్యాపిండ్ యాంటీజెన్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇంకా కొన్ని ప‌రీక్షా ఫ‌లితాలు రావాల్సి ఉంద‌ని, మొత్తం బాధితులు రెండువేల‌మంది అవుతార‌నే అంచ‌నా ఉంద‌ని హ‌రిద్వార్ వైద్య‌, ఆరోగ్య‌శాఖాధికారి శంభుకుమార్ తెలిపారు. గ‌తేడాది ఢిల్లీలో జ‌రిగిన ప్రార్థ‌న‌లు క‌రోనాను దేశ‌వ్యాప్తంగా అన్ని ప్రాంతాల‌కు తీసుకువెళ్లాయ‌ని, తాజాగా జ‌రిగిన కుంభ‌మేళా కూడా క‌రోనా రెండోద‌శ‌ను దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల‌కు చేర్చ‌బోతోంద‌నే ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే కుంభ‌మేళా క‌రోనా హాట్‌స్పాట్‌గా మారిందంటూ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: