తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం రైతు బంధు. ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద ఏడాదికి 10 వేలు అందజేస్తుంది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో రెండు విడతలుగా జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది రైతు బంధు డబ్బులను నేడు సర్కార్ జమచేయనుంది.

అయితే మొదటగా ఎకరం భూమి అంతకంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. దాంతో ఈరోజు మొత్తం 16 లక్షల 95వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. మొత్తం రూ.516.96 కోట్లను ప్రభుత్వం నేడు విడుదల చేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: