తైవాన్ గ‌గ‌న‌త‌లంలోకి 25 యుద్ధ విమానాల‌తో చైనా దూసుకువెళ్లింది. వీటిల్లో బాంబ‌ర్లు, ఫైట‌ర్‌జెట్లు ఉన్నాయి. గాల్వాన్ లోయ‌, పాంగాంగ్ స‌ర‌స్సువ‌ద్ద భార‌త్‌తో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతుండ‌గానే చైనా మ‌రోసారి ఈ దుందుడుకు చ‌ర్య‌కు పాల్ప‌డింది. జ‌న‌వ‌రి 24వ తేదీన 15, ఏప్రిల్ 12వ తేదీన 25 యుద్ధ‌విమానాలు తైవాన్ స‌మీపం నుంచి వెళ్లాయి. తైవాన్ ను ఆక్ర‌మించుకోవ‌డానికి కొన్నేళ్లుగా చైనా ప్ర‌య‌త్నిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చైనా అంత‌ర్జాతీయ నియ‌మాల‌ను గౌర‌వించాల‌ని, బాధ్య‌త‌గా మెల‌గాల‌ని నాటో కూట‌మి కూడా కోరింది. అణుక్షిప‌ణుల త‌యారీలో ఆ దేశం చూపిస్తోన్న దూకుడు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని, ప్ర‌పంచానికే ముప్పు పొంచివుంద‌ని తీర్మానించింది. నాటో కూట‌మి స‌మావేశంలో చైనా పేరును ప్ర‌స్తావించ‌డం ఇదే తొలిసారి. ఇది జ‌రిగి రెండురోజులు కూడా కాకుండానే చైనా మ‌ళ్లీ యుద్ధ‌విమానాల‌తో తైవాన్ గ‌గ‌న‌త‌లంలోకి వెళ్ల‌డంపై నాటో దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag