జులై ఒక‌టో తేదీ నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఏపీ ఇంట‌ర్‌బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్‌జ‌లీల్  చెప్పారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు అయిన త‌ర్వాత వాటి ఫ‌లితాలు స‌త్వ‌ర‌మే విడుద‌ల‌య్యేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ‌రంగ సంస్థ సీజీజీ ద్వారా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల‌నే యోచ‌న ఉంద‌ని, వారంలోప‌లే ఫ‌లితాలు వెల్ల‌డించేలా స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతానికి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులే నిర్వ‌హిస్తామ‌ని, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి కొవిడ్ ఉధృతి పూర్తిగా త‌గ్గుమ‌ఖం ప‌ట్టిన త‌ర్వాత ఫిజిక‌ల్ త‌ర‌గ‌తులు ఉంటాయ‌న్నారు. అఫిలియేష‌న్ విష‌యంలో ప్ర‌యివేటు క‌ళాశాల‌లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయ‌ని, అటువంటి క‌ళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఇంట‌ర్‌, ప‌ది ప‌రీక్ష‌లు వ‌ద్ద‌ని, ప్ర‌స్తుత‌మున్న వాతావ‌ర‌ణంలో విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌లేర‌ని విద్యావంతులు, మేధావులు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. అయితే వారి భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హించే యోచ‌న ఉంద‌ని అందులో ఎటువంటి సందేహాల‌కు తావులేద‌ని ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag