తెలంగాణ మంత్రి హరీష్ రావు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలోని పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గతంలో 87 లక్షల 41వేల మందికి రేషన్ కార్డులు అందజేసామని కొత్తగా 3లక్షల మందికి రేషన్ కార్డులు అందజేశామని అన్నారు. కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో అన్ని రకాల కార్డులు దాదాపు 90 లక్షల పైనే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని అన్నారు.

దేశంలో 95.5 శాతం జనాభాకు రేషన్ బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రేషన్ కార్డుపై 20 కిలోల సీలింగ్ యూనిట్ ను ఎత్తి వేశామని.. 4 కేజీల నుండి 6 కేజీల బియ్యం అందిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం రెండు వేల పదిహేడు వందల అరవై ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కెసిఆర్ రైతుబంధు గా మారి రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటున్నాడని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని చెప్పారు. ఓట్ల కోసం కాదని ప్రజల సంక్షేమం కోసమే పని చేశామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: