గత కొంతకాలం నుంచి దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆటోమేటిక్ రోబోట్లు పని చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న ఇలాంటి ఓ సంఘటనను ఉదాహరణగా తీసుకుని తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వంపై సెటైర్ వేసింది. విజయవాడలోని ఓ హోటల్ లో రెండు ఆటోమేటిక్ రోబోట్లను నియమించారు. కరోనా నేపథ్యంలో మనుషుల్లా కాకుండా, కాంటాక్ట్ లేకుండా సర్వింగ్ చేయడం వీటి పని. హోటల్ మేనేజర్ నాగేష్ మాట్లాడుతూ రోబోల సర్వీసుకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని తెలియజేశారు. 

రోబోట్ లతో పని చేయించడం రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి. దీంతో ఈ న్యూస్ ను ప్రముఖ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కవర్ చేసి ట్వీట్ చేసింది. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా "మేము 2024లో అధికారంలోకి వచ్చేంత వరకు సీఎం జగన్ స్థానంలో, వైఎస్ఆర్సిపి క్యాబినెట్ లో కొన్ని రోబోలను ఇన్స్టాల్ చేయగలమా? ఇంటెలిజెన్స్, గవర్నెన్స్ కన్నా రోబో సామర్థ్యం బాగుంది" అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై వైఎస్ఆర్సిపి ఏమంటుందో మరి!!


మరింత సమాచారం తెలుసుకోండి: