ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే.... మరోవైపు అదే ప్లాంట్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ సమయంలో రికార్డు స్థాయిలో ప్రాణవాయువు అందించిన విశాఖ స్టీల్ ప్లాంట్... ఇప్పుడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. జులై నెలలో అత్యధికంగా 540.8 వేల టన్నుల ఉక్కును విక్రయించి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ.. ఆర్ఐఎన్ఎల్ స్వయంగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఇది 38 శాతం పెరుగుదల అని ఆర్ఐఎన్ఎల్ వెల్లడించింది. ఏప్రిల్-జులై మధ్య నాలుగు నెలల కాలంలో 1538 వేల టన్నుల ఉక్కును అమ్మినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే... 48 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్ఐఎన్ఎల్ వెల్లడించింది. ఓ వైపు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తుంటే... ప్లాంట్ మాత్రం రికార్డుల మీద రికార్డులతో కేంద్రానికే సవాలు విసురుతోంది. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... ఢిల్లీలో ఆందోళన జోరుగా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: