ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ అటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్షాలు గొంతెత్తి గోల చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ అటు ప్రజా పద్దుస సంఘం ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఇప్పటికే ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా మార్చారంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. అసలు ఇలాంటి సమాచారం బయటకు ఎలా వెళ్తుందా అనే కోణంపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్.. ఆర్థిక సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్నారన్న ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్థిక శాఖలో ఇద్దరు సెక్షన్ అధికారులు, ఓ సహాయ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. సెక్షన్ అధికారులుగా ఉన్న డి.శ్రీనిబాబు, కే.వరప్రసాద్, సహాయ కార్యదర్శిగా ఉన్న నాగులపాటి వెంకటేశ్వర్లును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: