ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఓలా స్కూటర్ అమ్మకాల్లో రికార్డులు నెల‌గొల్పుతోంది. రెండు వేరియంట్లలో విడుదలైన‌ ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో వేరియంట్ల  విక్రయాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. కేవలం 24 గంటల్లో రూ. 600 కోట్ల విలువైన స్కూటర్లను విక్రయించినట్లు ఓలా కంపెనీ ప్ర‌క‌టించింది. ప్రతి సెకనుకు నాలుగు స్కూటర్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ వర్గాలు వెల్ల‌డించాయి. ఓలా యాప్‌లో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు తమ స్లాట్‌లను బుక్‌ చేసుకున్నారని ఓలా చైర్మన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భవేష్‌ అగర్వాల్‌ పోస్టు చేశారు. కేవలం 24 గంటల్లో రూ. 600 కోట్లకుపైగా విలువైన స్కూటర్లను విక్రయించిన‌ట్లు తెలిపారు. వినియోగదారుల స్పందన అంచనాలకు మించి ఉందంటూ ఆనందం వ్య‌క్తం చేశారు. విద్యుత్తు వాహనాల బుకింగ్‌లోనూ ఓలా రికార్డులు నెలకొల్పింది. కేవలం రూ. 499ల తో బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండ‌టంతో విడుదలైన రోజే వెయ్యి నగరాల్లో లక్ష బుకింగ్‌లతో సంచ‌ల‌న రికార్డులు సృష్టించిన‌ట్లు ఓలా కంపెనీ ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: