నంద‌మూరి బాల‌క్రిష్ణ హీరోగా న‌టిస్తున్న సినిమా అఖండ నుండి లిరిక‌ల్ సాంగ్ ను రేపు విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రేపు సాయంత్రం 5 33కు లిరిక‌ల్ రోర్ ఉండ‌బోతుంద‌టూ స్ప‌ష్టం చేసింది. అడిగా అడిగా అనే లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేస్తున్నట్టు...మొద‌ట అఖండ నుండి లిర‌క‌ల్ పాట‌ను వ‌దులుతోంది. ఇక ఈ సంధ‌ర్భంగా ప్ర‌గ్య్నా జైశ్వాల్ తో క‌లిసి బాలయ్య న‌డుస్తున్న పోస్ట‌ర్ ను కూడా వ‌దిలింది. 

ఇక ఈ పోస్ట‌ర్ లో ప్ర‌గ్యా జైశ్వాల్ చీర క‌ట్టులో ఆకట్టుకుంటుండ‌గా బాల‌య్య లుక్ ఇది వ‌ర‌కూ చూసిన పోస్ట‌ర్ మాదిగానే క‌నిపిస్తుంది. ఇక ఇప్ప‌టికే బాల‌య్య అభిమానులు అప్డేట్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుండి గ‌త కొద్ది రోజులుగా ఎలాంటి అప్డేట్ లేక‌పోవ‌డంతో నిరాశ‌లో ఉన్నారు. ఇక తాజా అప్డేట్ తో బాల‌య్య ఫ్యాన్స్ లో మ‌ళ్లీ హుషారు పెరిగింది. సోష‌ల్ మీడియాలో లిరిక‌ల్ సాంగ్ అప్డేట్ ను ట్రెండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: