గోవాకు వెళ్లే ప్రయాణికులకు మంచి శుభవార్త. జార్ఖండ్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా కొత్త రైలు ప్రారంభ‌మైంది. ఈ నెల 28న జార్ఖండ్‌లోని జసీడీ రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైలు బ‌య‌లుదేరి గోవాలోని వాస్కోడిగామాకు చేరుతుంది. రైలు (06398) 28వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు జసీడీ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరి చిత్తరంజన్‌, బొకారో స్టీల్‌ సీటీ, రాంచీ, రూర్కెలా, బిలాస్‌పూర్‌, రాయపూర్‌, బలార్ష, మంచిర్యాల, కాజీపేట మీదుగా 29 సాయంత్రం 6.00 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈమేర‌కు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివ‌రాలు తెలియ‌జేశారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి వికారాబాద్‌, రాయచూర్‌, గుంతకల్‌, బళ్లారి, హుబ్లీ మీదుగా 30వ‌తేదీ మధ్యాహ్నం 2.40 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. ఈ రైల్లో రెండు ఏసీ టూ టైర్‌, థర్డ్‌ ఏసీ త్రీ టైర్‌, ఐదు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు, రెండు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలుంటాయని అధికారులు వివ‌రించారు. గోవా వెళ్లేవారికి ఇది మ‌రొక మంచి అవ‌కాశ‌మ‌ని, టికెట్లు న‌మోదు ప్ర‌క్రియ ప్రారంభించిన‌ట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: