తెలంగాణ రాష్ట్ర పభుత్వం హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మండిప‌డ్డారు. ముషీరాబాద్‌ వాలీబాల్‌ గ్రౌండ్‌లో కార్పొరేటర్‌ సుప్రియానవీన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని కిష‌న్‌రెడ్డి ప్రారంభించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తో క‌లిసి ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. నగరం నుంచి రూ.వేల కోట్లలో ఆదాయం వస్తున్నా నగరాభివృద్ధికి నిధులు కేటాయించకుండా వాటిని వేరేవాటికి దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల జీహెచ్‌ఎంసీ దివాళా తీసిందని, చిన్నపాటి వర్షా నికే నగర రోడ్లు చెరువులుగా మారుతున్నాయని విమ‌ర్శించారు. డా.కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ వార్డు కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంగా మారాలని ఆశించారు. కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాం సుందర్‌గౌడ్‌, సీకే శంకర్‌, నియోజకవర్గం బీజేపీ జాయింట్‌ కన్వీనర్‌ ఎం.నవీన్‌ గౌడ్‌, కార్పొరేటర్‌ సునీతాగౌడ్‌, బీజేవైఎం నగర కార్యదర్శి అనిల్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: