మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన సినిమా కొద్దిరోజులుగా దిగ్విజ‌యంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాన రాష్ట్రాల‌తోనే కాకుండా చెన్నై, బెంగ‌ళూరుల్లోని ధియేట‌ర్లు కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. టికెట్లు కావాలంటే వారం ముందుగా బుక్ చేయించుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆన్‌లైన్ కాలంలో కూడా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారంటూ అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే సినిమా అంత సూప‌ర్‌గా వ‌చ్చింది. ఇలాంటి మా సినిమా ఇటీవ‌ల‌కాలంలోనే రాలేదంటున్నారు. సినీ విశ్లేష‌కుల ప్ర‌శంస‌లు కూడా ఈ సినిమాకు ద‌క్కుతున్నాయి.  మాట‌ల యుద్ధాలు, తూటాల్లా పేలిన మాట‌లు ధియేట‌ర్‌లో డాల్బీ సౌండ్‌లో వింటే గుండె జ‌ల్లుమంటోంది. ప్ర‌తి న‌టుడు త‌మ త‌మ పాత్ర‌కు వంద‌కు 200 శాతం న్యాయం చేశార‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏ ఒక్క‌రినీ తీసేయ‌డానికి వీల్లేనివిధంగా సినిమా రూపొందించారంటున్నారు. దీన్ని తీర్చిదిద్దిన ద‌ర్శ‌కుడు పేరు మాత్రం బ‌య‌ట‌కు పెట్ట‌డంలేదుకానీ క‌థ‌, స్క్రీన్ ప్లే, సంగీతం, మాట‌లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయాయంటున్నారు సినిమా చూసిన‌వారంతా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

maa