మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ర‌గ‌డ ఇంకా చ‌ల్లార‌లేదు. ఆ వేడి అగ్నిప‌ర్వ‌తంలా ర‌గులుతూనే ఉంటుంది. బ‌ద్ద‌లైన‌ప్పుడు లావా వెద‌జ‌ల్లుతుంది. మా అసోసియేష‌న్ కూడా బ‌ద్ధ‌లైతే ఆత్మ లేదంటే ఏటీఎం లాంటివి పుట్టుకొస్తాయి. వారికి కావ‌ల్సింది క‌ళాకారుల సంక్షేమం కాద‌ని ఇప్పుడు స్ప‌ష్టంగా తెలియ‌వ‌స్తోంది. కేవ‌లం ఎన్నిక‌ల ప్ర‌చారంలో రెండు ప్యానెల్స్ అబద్దాలు ఆడాయి. ఎన్నిక‌ల కోసం గిమ్మిక్కులు చేశాయి. మ‌నం బాగుండాలి.. మ‌న వ్యాపారాలు మాత్ర‌మే బాగుండాల‌నుకునేవారే ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారు. నిజంగా క‌ళాకారుల కోసం ఆలోచించేవారైతే ఎన్నిక ప్ర‌క్రియ ముగిసిపోయిన త‌ర్వాత అంద‌రూ క‌లిసిపోయి మా అభివృద్ధికి పాటుప‌డేవారు. కానీ ఇక్క‌డ గెల‌వ‌లేద‌నే అహంకారం, ప‌ట్టు స‌డ‌లింద‌నే అవ‌మానం, ఒక వ‌ర్గం మాత్ర‌మే గెలుపొందింద‌నే ఆలోచ‌న వారిని కుదురుగా ఉండ‌నీయడంలేదు. నిద్ర కూడా ప‌ట్ట‌డంలేదు. వేల‌కోట్ల రూపాయ‌ల ఆస్తులు కాపాడుకోవాలి.. ఇప్పుడేం చేయాలి.. ఎలా ప‌ట్టు నిల‌బెట్టుకోవాలి అన్న ఆలోచ‌న కూడా తొలిచేస్తోంది. అందుకే తెర‌పైకి ఆత్మ‌, ప్రేతాత్మ‌, ఏటీఎం లాంటి పేర్లు పుట్టుకొస్తున్నాయి. అంత‌టి సాహ‌స‌మే చేస్తారా?  ప్ర‌త్య‌ర్థుల‌ను భ‌య‌పెట్టి త‌మ అదుపులో ఉంచుకోవ‌డానికి చేస్తున్నారా? అనేది తెలియాలంటే కొద్దికాలం వేచిచూడ‌క త‌ప్ప‌దు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

maa