రాష్ట్రంలో గడిచిన పదిరోజులు గా కొవిడ్‌కేసులు తగ్గుముఖం పట్టాయ‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ఒక్క‌సారిగా  బెంగళూరులో కేసు లు పెరుగుతుండ‌టం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ఈ పరిణామం రాష్ట్రమంతటా ప్రభావం చూపుతుంద‌ని అర్థం కావ‌డంతో వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. రాష్ట్ర‌వ్యాప్తంగా 462 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 253 మంది, మైసూరులో 43మంది, తుమకూరులో 32 మంది వైర‌స్ బారిన ప‌డ్డారు. నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాక‌పోవ‌డం కొంత‌లో కొంత ఊర‌ట‌గా అధికారులు భావిస్తున్నారు. బుధ‌వారం నాడు 479 మంది డిశ్చార్జ్‌ కాగా 9 మంది మ‌ర‌ణించారు. 30 జిల్లాల్లో 9,074 మంది చికిత్సలు పొందుతుండగా అందులో 6,760 మంది ఒక్క బెంగళూరులోనే ఉండ‌టాన్ని ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. ఇప్ప‌టికే బెంగ‌ళూరు రావాలంటే ఇత‌ర రాష్ట్రాల‌వాసులు క‌రోనా నెగ‌టివ్ స‌ర్టిఫికెట్ చూపించాల‌నే నిబంధ‌న‌ను అమ‌లు చేస్తోంది. అంతేకాకుండా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమిగూడే ప్రాంతాల‌ను గుర్తించి అక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని, టీకాల‌పై అవ‌గాహ‌న పెంపొందించాల‌ని నిర్ణ‌యించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: