అక్రమార్జన కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హజరయ్యారు. ఆయ‌న‌ అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన విష‌యం తెలిసిందే. జులైలో ఎంఆర్‌ విజయభాస్కర్‌ నివాసగృహాలు, బంధువులు, స్నేహితుల నివాసగృహాలు సహా 21 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు జ‌రిపింది. ఆ తనిఖీలలో అక్రమార్జనలకు సంబంధించి కీలకమైన దస్తావేజులను స్వాధీనం చేసుకొని, సెప్టెంబర్ 30న‌ విచారణకు రమ్మంటూ సమన్‌ జారీ చేసినా విజయభాస్కర్‌ హాజర‌వ‌లేదు. అక్టోబరు 25న విచారణకు హాజరుకావాలని రెండోసారి స‌మ‌న్లిచ్చారు. స్థానిక ఆలందూరు  ఏసీబీ కార్యాలయానికి ఎంఆర్‌ విజయభాస్కర్‌ సోమవారం హాజ‌ర‌వ‌గా ఆయ‌న అక్రమార్జనలకు సంబంధించిన వివరాలపై అధికారులు ప్ర‌శ్న‌లు సంధించారు. తమ తనిఖీలలో పట్టుబడిన నగదుకు సంబంధించి అధికారులు వివ‌ర‌ణ అడ‌గ‌డంతోపాటు సుమారు గంటకు పైగా ఈ విచారించారు. అన్నాడీఏంకే హ‌యాంలో విజ‌య‌భాస్క‌ర్ ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు గ‌తంలోనే ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదులు అందాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

acb