గుంటూరు జిల్లా లో ని గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలోని దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ని అధికార వైసీపీ కైవ‌సం చేసుకుంది. ఇక్క‌డ ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య హోరా హోరీ పోరు కొన‌సాగింది. ముందు రౌండ్ల‌లో ఫ‌లితాలు చూస్తే టీడీపీ ఈ న‌గ‌ర పంచాయ‌తీ ని గెలుచు కుంటుందా ? అన్న వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే చివ‌రి రౌండ్ల‌లో వైసీపీ ఎక్కువ వార్డులు గెలుచు కోవ‌డంతో ఎట్ట‌కేల‌కు దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ పై వైసీపీ జెండా ఎగ‌ర వేసిన‌ట్టు అయ్యింది. మొత్తం 20 వార్డుల‌కు గాను వైసీపీకి 11, టీడీపీ 8 వార్డుల్లో విజ‌యం సాధించాయి. ఇక్క‌డ ఒక వార్డులో జ‌న‌సేన గెలిచింది. ఇక్క‌డ గెలుపుతో సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డి త‌న ప‌ట్టు నిలుపుకున్న‌ట్టు అయ్యింది. అయితే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస రావు సైతం గ‌ట్టి పోటీ ఇచ్చేలా క‌ష్ట‌ప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: