తెలంగాణ‌లో బీజేపీలో చేరేందుకు టీఆర్ఎస్ నేత‌లు సిద్ధంగా ఉన్నార‌ని బీజేపీ ఇన్‌చార్జీ  త‌రుణ్‌చుగ్ పేర్కొన్నారు.  హైద‌రాబాద్‌లో బీజేపీ స‌మావేశాలు నిర్వహిస్తున్న సంద‌ర్భంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీజేపీ గేట్లు తెరిచి సిద్ధంగా ఉంచుతుంద‌ని చెప్పారు. పదుల సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు తమతో  ఇప్ప‌టికీ టచ్‌లోనే ఉన్నార‌ని కీలక వ్యాఖ్యలు చేసారు తరుణ్ చుగ్.

కాషాయ కండువా కప్పుకునేందుకు టీఆర్ఎస్ నాయ‌కులు సమయం కోసం వేచి చూస్తున్నారని వివ‌రించారు.  టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చట్టం తన పని తాను చేసుకుపోతుంద‌ని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్ర‌జ‌లే త‌గిన స‌మ‌యంలో యాక్ష‌న్ తీసుకుంటార‌ని పేర్కొన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు భ‌విష్య‌త్ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పున‌రావృతం అవుతాయ‌ని జోస్యం చెప్పారు త‌రుణ్‌చుగ్‌. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యం‌ కొనుగోలు చేస్తోందని వెల్ల‌డించారు. పరిపాలన చేతకాకనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నింద వేస్తుంద‌ని తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతుందని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ కాషాయ జెండా ఎగురుతుంద‌ని త‌రుణ్‌చుగ్ ధీమా వ్య‌క్తం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: