అక్కడ గుమి కూడిన వారందరూ వైద్య విద్యార్థులే....భవిష్యత్ డాక్టర్లే.. మానవతా దృక్పథంతో సేవ చేయాల్సిన వారే. కనిపించని శత్రువుపైమానవాళి చేస్తున్న పోరాటానికి తమ వంతు సేవలందించాల్సిన వారే. వారే క్రమశిక్షణ తప్పారు. కోవిడ్ బారిన పడ్డారు.
 తెలంగాణ రాష్ట్రాన్నే కాదు ,యావత్ భారత్ నూ కరీంనగర్ జిల్లా అలేర్ట్ చేసింది.. ఈ జిల్లా లోని బొమ్మకల్ వద్ద  చలమేడ ఆనంద రావు  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన వైద్య కళాశాల ఉంది. ఈ కళాశాలలో వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో కళాశాల ను మూసి వేశారు. కళాశాలలో ఇప్పటి వరకూ 200 మందికి  కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వారిలో యాభై మందికి పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది. దీంతో అలెర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కళాశాలకు వెళ్లి  దాదాపుగా వెయ్యి మందికి పైగా వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిడాక్టర్ జువేరియా  తనదైన వివరణ ఇచ్చారు. కళాశాలలో గత వారం ఒక వార్షికోత్సవం జరిగిందని,  ఈ కార్యక్రమం లో వేలాది మంది విద్యార్థులు పాల్గోన్నారని, ఒక్కరు కూడా మాస్క్ లు ధరించ లేదని ఆయన తెలిపారు. ఈ వార్షికోత్సవానికి సబంధించి తమకు ఎలాంటి ముంస్తు సమాచారం లేదని కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేర్కోన్నారు.
తెలంగాణలో ఓమిక్రాన్ వైరస్ వచ్చిందని వార్తలు వెలువడుతున్న  సమయంలో వైద్య కళాశాల విద్యార్థులకు  కరోనా పాజిటిన్ రావడం కలకలం సృష్టిస్తోంది. ఈ కళాశాలలో జరిగిన వార్షికోత్సవ వివరాలు పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు  జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖఅధికారులు కళాశాల లో ప్రత్యేక క్యాంప్ పెట్టి విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందరూ కూడా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారని,  పరీక్షల నివేదిక వచ్చిన తరువాత కానీ ఏ విషయం పాత్రికేయలకు చెప్పలేమని వైద్య శాఖ సిబ్బంది అనధికారికంగా  తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: