ఆయన తాజాగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డిపోను సందర్శించారు. అక్కడి డిపో, గ్యారేజ్, బస్టాండ్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. ఆర్టీసీ సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్ నుంచి సదాశివపేటకు ఆర్టీసీ బస్సులో వెళ్లిన సజ్జనార్.. ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తే మరిన్ని అదనపు బస్సులు నడుపుతామన్న సజ్జనార్.. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని తెలిపిన సజ్జనార్.. ఆర్టీసీ సిబ్బంది అంతా రెండు డోసుల టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అధికారులు, సిబ్బంది అంతా కలిసి అంకితభావంతో పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తామన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి