జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయిందంటున్నారా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.. తాజాగా ఆయన జగన్ పాలనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇటీవల బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరిగ్గా వైద్యం అందక మరణించారు.. దీన్ని ప్రస్తావించిన నారా లోకేశ్.. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే లెక్చరర్ రామకృష్ణ చేసిన శాపమా అని ప్రశ్నించారు.

డ్యూటీ డాక్టర్ వుండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు..వాస్తవమేమో ప్రజల పాలిట యముడు అంటూ నారా లోకేశ్ మండిపడ్డారు. కక్షసాధింపుల్లో జగన్ ప్రభుత్వం ఉంటే, వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని నారా లోకేశ్ విమర్శించారు. లెక్చరర్ రామకృష్ణది ప్రభుత్వ హత్యేనని.. రోజురోజుకీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా వైసిపి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని నారా లోకేష్ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: