బ్యాంకుల్లో మోసాలు ఇటీవల బాగా పెరిగాయి. సైబర్ క్రైమ్‌ రేట్ పెరుగుతోంది. అయితే.. దానికి సంబంధించిన తాజా నివేదక ఆశ్చర్యం  కలిగిస్తోంది. నగదుపరంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాలు 51 శాతం తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. 2021-22లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంక్ ల్లో  40,295 కోట్ల రూపాయల మేర  మోసాలు జరిగాయట. అదే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 81, 921 కోట్ల రూపాయల మేర మోసాలు జరిగాయట.


ఈ వివరాలు ఆర్‌బీఐ స్వయంగా వెల్లడించింది.  చంద్రశేఖర్  గౌర్  అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద కోరితే ఈ సమాచారం వెల్లడించింది. సంఖ్యాపరంగా చూస్తే తగ్గుదల ఆశించిన స్థాయిలో లేదని ఆర్ బీఐ అంటోంది. 2020-21 9, 933 బ్యాంకు మోసం కేసులు నమోదు అయ్యాయి.. 2021-22లో ఆ సంఖ్య 7,940కి తగ్గింది.


మరింత సమాచారం తెలుసుకోండి: