భాగ్యనగరంలో పేదలకు సర్కారు ఆస్పత్రులే దిక్కు.. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వాటిలో ప్రధానం. అలాంటి ఉస్మానియాలో కొత్త భవంతి ఏర్పాటుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. సాధ్యాసాధ్యాలకు సంబంధించిన త్వరగా నివేదిక ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు నిపుణుల కమిటీని కోరారు.  చీఫ్ ఇంజినీర్ల కమిటీ తన రిపోర్టును త్వరగా ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. హైకోర్టు సూచనలు, కమిటీ రిపోర్టు ప్రకారం హెరిటేజ్ బిల్డింగ్ కి ఇబ్బంది కలగకుండా కొత్త నిర్మాణాలు చేపడతారు.  కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంసీఆర్ హెచ్ ఆర్ డీలో ఉస్మానియా ఆసుపత్రిపై నియమించిన చీఫ్ ఇంజినీర్ల కమిటీ తో మంత్రి హరీశ్ రావు భేటీ ఆయ్యారు. సమావేశంలో మంత్రి హరీశ్ రావుతో పాటు... మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. టీఎస్ ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ సహా పలువురు వైద్య ఆరోగ్య  శాఖ ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: