ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయపార్టీని ఏర్పాటు చేయనున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాన శంకరరావు ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు కలుపుకుని రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి తీర్మానించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాన శంకరరావు చెప్పారు. గుంటూరులో జరిగిన బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యవర్గసమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు.


ఈ సమావేశానికి పలు జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘఁ అధ్యక్షుడు శంకరరావు సభలో చేసిన తీర్మానాలను వివరించారు. సమావేశానికి 76 కులసంఘాల ప్రతినిధులు హాజరయ్యారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాన శంకరరావు తెలిపారు. ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్నసంకల్పాన్ని వ్యక్తపరిచినట్లు ఆయన చెప్పారు. త్వరలో పార్టీకి సంభంధించిన మండల కమిటీలు, అనుబంధ కమిటీలు వేస్తామని శంకరరావు అంటున్నారు. ఇన్నాళ్లు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశాన శంకరరావు....55 శాతం మంది జనాభా కలిగిన బీసీలను ఏకతాటిపైకి తేవడం లక్ష్యమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: