బీజేపీ పై యుద్ధం ప్రకటించిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు ఈడీ రూపంలో షాక్‌ తగిలినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావుకు ఇప్పుడు ఈడీ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు చెందిన మధుకాన్ గ్రూపు కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.96.21 కోట్ల విలువైన మధుకాన్ ఆస్తులను ఈడీ  తాత్కాలికంగా జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే కేసులో మధుకాన్, డైరెక్టర్ల ఆస్తుల జప్తు జరిగినట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.


రాంచీ-జంషెడ్‌పూర్ హైవే రుణం దారి మళ్లించినట్లు ఈడీ అభియోగం దాఖలు చేసింది. ఈ కేసులో నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో 6 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. దీంతో మధుకాన్ షేర్లు సహా రూ.7.36 కోట్ల చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఇది పాత కేసే.. ఇప్పుడు బీజేపీతో టీఆర్ఎస్ కు సంబంధాలు చెడిపోతున్న నేపథ్యంలో ఈడీ ఇచ్చిన ఈ షాక్ చర్చనీయాంశం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: