చైనా.. ఇండియా సరిహద్దుల్లో ఓ గ్రామం నిర్మిస్తోందంటూ వచ్చిన వార్తలు.. అందుకు తగిన ఆధారాలుగా శాటిటైల్‌ చిత్రాలు వెలుగులోకి రావడం రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెంచుతోంది. అలాగే ఆ ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాలు.. ఆరు భవనాల పునాదులు కూడా ఈ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. డోక్లాం పీఠభూమిపై ఆధిపత్యం కోసం చైనా యత్నిస్తోందని ఈ చిత్రాల ద్వారా తెలుస్తోంది.


చైనా కుట్రలకు పాంగ్డా గ్రామం  అద్భుతమైన ఉదాహరణ అని మాజీ సైన్యాధికారులు కూడా చెబుతున్నారు. సరిహద్దుల్లో గ్రామాలు నిర్మించి అక్కడ తమ ఉనికిని చాటుకోవాలని చైనా భావిస్తోందని వారు అంటున్నారు. అయితే సరిహద్దుల్లో చైనా ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొనేందుకు మేం సిద్ధం అని  రక్షణ శాఖ వర్గాలు ప్రకటిస్తున్నాయి. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే ఎలాంటి కార్యాక్రమాలనైనా ఎదుర్కొంటామంటున్నాయి. ఈ ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: