ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సంగతి తెలిసిందే కదా.. ప్రపంచంలోనే క్రూరమై నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇప్పుడు అమెరికాను బెదిరిస్తున్నాడు. అమెరికాతో యుద్ధం అంటూ వస్తే అణు బాంబు వేసేస్తా.. మొహమాటం ఏమీ లేదని తేల్చి చెప్పేస్తున్నాడు. అమెరికా ఓవర్ యాక్షన్‌తో కొరియా ద్వీపకల్పాన్ని యుద్ధం అంచులోకి వెళ్తోందని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.


1950-53 కొరియన్‌ యుద్ధం 69వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రసంగించారు. తమ సైన్యం ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమని ప్రకటించారు. అమెరికా తన విధానాలను సమర్థించుకునేందుకు ఉత్తర కొరియాను ప్రపంచానికి బూచిగా చూపుతోందని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విమర్శించారు. అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త యుద్ధ విన్యాసాలు ద్వంద్వ ప్రమాణాలకు ఉదాహరణగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కామెంట్ చేశారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తే మాత్రం అమెరికా నానా యాగీ చేసేదని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kim