దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో వైసీపీ దేశంలోనే ఓ విషయంలో నెంబర్ వన్‌గా నిలిచింది. ఏ విషయంలో అంటారా.. విరాళాల విషయంలో.. ఈ ఏడాది అత్యధికంగా విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీగా వైసీపీ రికార్డు సృష్టించిందని.. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ తెలిపింది. ఎన్నికల విరాళాలకు సంబంధించి ఓ కీలక నివేదికను ఈ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ బయట పెట్టింది.


2020-21 ఆర్థిక సంవత్సరంలో తనకు 179 కోట్లు గుప్త విరాళాలు వచ్చినట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఇదే కాలానికి గుర్తు తెలియని మూలాల నుంచి రూ.100 కోట్లు విరాళంగా వచ్చినట్లు బీజేపీ తెలిపిందని ఏడీఆర్‌ సంస్థ చెబుతోంది. ఇక ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ టాప్ లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ రూ.96.25 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో ఉందని ఏడీఆర్‌ తెలిపింది. ఆ తర్వాత స్థానంలో డీఎంకే రూ.80.02 కోట్లుతో, బీజేడీ రూ.67 కోట్లుతో, ఎంఎన్‌ఎస్‌ రూ.5.77 కోట్లతో, ఆప్‌ రూ.5.4 కోట్లతో తర్వాత స్థానాల్లో నిలిచినట్టు ఏడీఆర్ సంస్థ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: