హైదరాబాద్‌లో ఉంటున్నారా.. ఇప్పటికే అనేక పర్యాటక ప్రాంతాలు చూసేశారు.. కొత్తగా చూసేందుకు ఏమీ కనిపించడం లేదా.. అయితే మీకు ఓ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌ చుట్టూ కొత్తగా  పలు పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారు. ప్రభుత‌్వం ఇందు కోసం అనేక ప్రాజెక్టులు సిద్ధం చేస్తోంది. అనంతగిరి హిల్స్‌లో 250 ఎకరాల్లో వెల్‌నెస్‌ కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. అలాగే.. అనేక రిసార్టులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


వీటిలో మరికొన్ని ఏంటంటే.. గండిపేట వద్ద పార్కు ఏర్పాటు చేస్తున్నారు. గండిపేట చెరువు చుట్టూ 46 కిలోమీటర్ల మేర సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఐటీ కారిడార్‌లోని కోకాపేట వద్ద అవుటర్‌ రింగురోడ్డు సర్వీసు రహదారిపై 23 కిలోమీటర్ల పొడవు 4.5 మీటర్ల వెడల్పుతో సైకిల్‌ట్రాక్‌ పనులు ప్రారంభిస్తున్నారు. వచ్చే వేసవి నాటికి ఇది అందుబాటులోకి రాబోతోంది. దీనికి దాదాపు 100 కోట్లు ఖర్చు చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: