విపక్షాలను ఐక్యం చేసేందుకు దిల్లీలో పర్యటించిన నితీశ్ కుమార్ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. ఆ తర్వాత ఇతర వామపక్ష నేతలను కలిశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కూడా భేటీ అయ్యారు. గతనెల ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్న తర్వాత తొలిసారి హస్తినలో పర్యటించిన నితీశ్ కుమార్ వివిధపార్టీలకు చెందిన నేతలతో వరుసగా సమావేశమయ్యారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతోపాటు ఇతర ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని నితీశ్ అంటున్నారు. ఆయన ఐఎన్‌ఎల్‌డీ చీఫ్ ఓంప్రకాశ్ చౌతాలా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్‌తోనూ సమావేశం అయ్యారు. ప్రతిపక్షాలను ఏకం చేయటమే తన పని అంటున్న నితీశ్ కుమార్ ఎంత వరకూ సక్సస్ అవుతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి