ఆర్థిక నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ఏ రకంగానైనా సరే డబ్బు సంపాదించాలన్న కోరిక జనంలో పెరుగుతోంది. ఇక రోజూ కళ్ల ముందే లక్షల రూపాయల నగదు చూసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో.. అదే జరిగింది కడపలో.. కడప నగరంలో ఏటీఎంలో నగదు పెడుతుండగా ఆ నగదు వాహనంతో డ్రైవర్‌ పరారైన ఘటన చోటు చేసుకుంది.

ఏటీఎంలలో నగదు పెట్టేందుకు కొన్ని ఏజెన్సీలు ఉంటాయి. కడప ఐటీఐ సర్కిల్‌ లోని ఓ ఏటీఎం వద్ద ఆ ఏజెన్సీకి చెందిన వాహనం నగదు నింపేందుకు వచ్చింది. వాహనంలో భారీగా నగదు ఉంది. ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు కొంత క్యాష్ తీసుకుని ఏటీఎంలోకి సిబ్బంది వెళ్లారు. ఇదే అదనుగా మిగిలిన 60 లక్షల రూపాయల నగదు ఉన్న వాహనంతో డ్రైవర్‌ పరారయ్యాడు. అదే వాహనాన్ని వినాయకనగర్‌లో డ్రైవర్ వదిలేసి డబ్బుతో పరారయ్యాడు. ఏజెన్సీ నియమించిన వాహన డ్రైవర్ కోసం కడప పోలీసులు గాలిస్తున్నారు. కనీసం రూ. 50 నుంచి 60లక్షలతో ఉడాయించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: