ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చటం పెద్ద వివాదంగా మారుతోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. అంబేద్కర్ విగ్రహాల వద్ద పార్టీ శ్రేణులు ప్రదర్శన చేపట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. జగన్ .. రాష్ట్రం మొత్తం తన జాగీరులా ముఖ్యమంత్రి భావిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

వైద్య విద్యకు సంబంధించి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఉంటే బాగుంటుందని భావించి ఎన్టీఆర్ అప్పట్లో యూనివర్శిటి ఏర్పాటు చేశారని.. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా దాన్ని కొనసాగించారని టీడీపీ నేతలు వివరించారు. ఇప్పుడు జగన్ మాత్రం పేరు మార్చి వైఎస్ పేరు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే వెంటనే పేరుమార్పు జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆందోళన చేస్తున్న తెదేపా నేతల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YSR