టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోందనీ, అందుకే ఆమె విదేశాల్లో వైద్య చికిత్స తీసుకుంటోందనీ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.అసలు అలాంటిది ఏమి లేదంటూ తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.అయితే, సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతుండడం నిజమేనని తేలింది. తాజాగా ఈ విషయమై స్వయంగా సమంతనే తన సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చింది .అంతే కాదు, ఆసుపత్రి నుంచే ఆమె ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.


గత కొద్ది నెలలుగా తాను ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నాననీ, దానిని మయోసైటిస్‌గా పరిగణిస్తారనీ, ప్రస్తుతం వైద్య చికిత్స తీసుకుంటున్నాననీ, తొలుత అనుకున్నంత వేగంగా చికిత్స పూర్తయ్యేలా కనిపించడంలేదని సమంత చెప్పుకొచ్చింది.వైద్యులు తనకు మంచి వైద్య చికిత్సను అందిస్తున్నారనీ, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో అందరి ముందుకూ వస్తానని సమంత పేర్కొంది.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: