మత విశ్వాసాలు మనిషిలోని దైవత్వాన్ని మేల్కొలపాలి. అందుకే అయ్యప్ప మాల వంటివి వేసుకుంటారు. అయితే.. ఈ దీక్ష అంతరార్ధం తెలియని కొందరు మూఢ విశ్వాసాలను పుట్టిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం కొండాగుంట గ్రామంలో ఇలా మానవత్వం మంటకలసిన ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వెంకటరమణయ్య మృతదేహాన్ని గ్రామస్తులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.


అందుకు కారణం ఏంటో తెలుసా.. ఆ గ్రామంలో  పలువురు అయ్యప్ప దీక్షలో ఉన్నారట. మృతదేహం ఊళ్లోకి వస్తే.. వారు మైలపడిపోతారట. అందుకే ఊరి వెలుపలే మృతదేహాం ఉంచుకోవాలని సూచించడం వివాదానికి దారి తీసింది. అంబులెన్స్ ను గ్రామస్తులు రోడ్డుపై నే అడ్డుకోవడంతో  మృతుని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తి చనిపోయి గ్రామానికి వస్తే అడ్డుకోవడం దారుణమని కనీసం మానవత్వం లేదా అని వాగ్వివాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: