టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బాపట్ల టౌన్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. దీంతోపాటు బాపట్లలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఈనెల 10వ తేదీన బాపట్ల జిల్లా చీరాలలో రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడే బహిరంగ సభ, ముస్లిం నేతలతో చంద్రబాబు సమావేశం ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు మరో రెండు రోజులు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన ను విజయవంతం చేసేందుకు గుంటూరు, బాపట్ల జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.


ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ఇప్పటికే చంద్రబాబు పర్యటనలు ప్రారంభించారు. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజులు తిరిగారు. ఇప్పుడు మూడు రోజులపాటు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ విడతలో  మూడు రోజుల్లో మూడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp