గుంటూరులో జనవరి 1వతేదీన జరిగిన సంక్రాంతి కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనపై రిటైడ్‌ జడ్జి శేషశయనారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కమిటీ పని ప్రారంభించింది. గుంటూరులో ఘటన జరిగిన ప్రదేశాన్ని రిటైడ్‌ జడ్జి శేషశయనారెడ్డి.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి పరిశీలించారు. సభావేదిక, ఘటన జరిగిన ప్రదేశం, ఆ సమయంలో అక్కడున్న పరిస్థితులపై పోలీసు అధికారులతో రిటైడ్‌ జడ్జి శేషశయనారెడ్డి మాట్లాడారు.

ఆరోజు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన కొందరు బాధితులతో రిటైడ్‌ జడ్జి శేషశయనారెడ్డి మాట్లాడారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో ఒకరైన స్థానిక కార్పొరేటర్‌ను పిలిచి రిటైడ్‌ జడ్జి శేషశయనారెడ్డి విచారణ జరిపారు. ఎంతమందికి ఏర్పాట్లు చేశారనే అంశాలపై రిటైడ్‌ జడ్జి శేషశయనారెడ్డి ఆరా తీశారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరిని పిలిచి ఘటనకు సంబంధించిన వివరాలను రిటైడ్‌ జడ్జి అడిగి తెలుసుకున్నారు. మరి ఈ కమిటీ ఏం తేలుస్తుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: