పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ ఇటీవల వల్లభనేని వంశీ, కొడాలి నానిపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు పత్తిత్తులుగా కనిపించిన వారు ఇప్పుడు అపవిత్రులుగా ఎలా కనిపిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వ‌ల్లభ‌నేని వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశువుల డాక్టరేనని.. మరి అప్పుడు మనుషుల డాక్టర్ అయ్యాడా అని పేర్ని నాని ప్రశ్నించారు.

2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని ఏమైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీరా..  ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు‌ కడిగే వాడా అంటూ పేర్ని నాని  నిలదీశారు. ఆ లారీ క్లీనర్‌ని చూస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ప్యాంట్లు తడుస్తున్నాయని... ఆ లారీ క్లీనర్లు, కప్పులు కడిగేవాళ్ల ఓట్లు టీడీపీకి అవసరం లేదా అని పేర్ని నాని  ప్రశ్నించారు. కొడాలి నానిని తాము చంద్రయాన్ సైంటిస్టు అని చెప్పుకోలేదే అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: