ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రం అందిస్తున్న పథకాల గురించి ఏకరువు పెడుతున్నారు. 17 రకాల పధకాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం మోడీ అమలు చేస్తున్నారన్న నిర్మలా సీతారామన్.. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఉచిత వైద్యం అందుతుందన్నారు. కోవిడ్ నుంచి ఉచిత బియ్యం ఇస్తున్నారు... మోడీ మరో ఐదేళ్లు ఇది పెంచారని నిర్మలా సీతారామన్ అన్నారు.


రైతుల కోసం పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు ఇస్తున్నారని.. పెర్టిలైజర్ బస్తా రెండు వేల విలు చేసేది రూ.266 కే  రైతులకు అందిస్తున్నారని.. పిఎం విశ్వకర్మ పేరుతో చేతి వృత్తుల వారిని మోడీ  ప్రోత్సహించారని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. పని ముట్లు కొనుగోలు చేయడానికి రెండు లక్షల రుణ సదుపాయం ఉందని.. కిసాన్ క్రెడిట్ కార్డు ... అందరూ తీసుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు. మోడీ మీ అందరికీ ఇచ్చే గ్యారంటీ ఇదన్న నిర్మలా సీతారామన్.. ఐదు శాతం వడ్డీ తో రుణాలు ఇస్తారని.. పోషణ్ అభియాన్ పేరుతో పోషకాలతో ఉత్పత్తులు ఇస్తున్నారని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: