ఎన్నికల్లో ఓటమితో మొత్తానికి కేసీఆర్‌కు వైరాగ్యం వచ్చేసినట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అన్న మాజీ సీఎం కేసీఆర్... ఎన్నో గొప్ప పనులు చేసిన ఎన్టీఆర్ అంతటి వారికే తప్పలేదని వ్యాఖ్యానించారు. ఓటములకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవారమా అని మాజీ సీఎం కేసీఆర్ క్యాడర్‌లో ధైర్యం నింపుతున్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో తెలంగాణ భవన్ లో నిన్న మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.  

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపీలపై నేతల నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. నామా నాగేశ్వర రావు, మాలోతు కవిత అభ్యర్థిత్వాలపై ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: