ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న పోలింగ్ జరగబోతోంది. ఈ సందర్భంగా కొన్ని గణాంకాలు చూద్దాం. ఏపీ రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. ఏపీ రాష్ట్రంలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో 2 కోట్లమంది పురుష ఓటర్లు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 3,482 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 67,434 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 7,603 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 887 ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 179 మహిళలతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో 50 యువతతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు ఉండగా.. రాష్ట్రంలో మొత్తం 555 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: