జగన్‌ రావాలి.. సాక్ష్యం చెప్పాలి అంటున్నాడు న్యాయవాది సలీమ్‌. ఈయన ఎవరో కాదు.. కోడికత్త కేసులో శ్రీనివాసరావు తరపున వాదించిన లాయర్‌. ఇప్పుడు గులకరాయి కేసులోనూ నిందితుల తరపున వాదిస్తున్నారు. తాజాగా గులకరాయి కేసు నిందితుడు సతీష్‌కు బెయిల్‌ ఇప్పించారు. నిందితుడు సతీష్ కుమార్ కు బెయిల్ రావడం సంతోషం గా ఉందంటున్న సతీష్ తరుపు న్యాయవాది సలీమ్.. జగన్ మోహన్ రెడ్డి అలవాటు పడిన నేరావృత వ్యక్తిగా కోర్ట్ కు విన్నవించాననన్నారు.


ప్రతి ఎన్నికల ముందు ఆయన పై ఆయనే దాడి చేసుకుని ప్రజల సానుభూతి పొందుతాడని వాదించానని తెలిపారు. గత ఎన్నికలో కోడికత్తి కేసుతో జనుపల్లి శ్రీనివాస్ ను ఈ సారి ఎన్నికకు గులకరాయి కేసు తో సతీష్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారని న్యాయవాది సలీమ్ అంటున్నారు. కోర్ట్ లో అదే విన్నవించానని న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారని న్యాయవాది సలీమ్ అన్నారు. అప్పుడు, ఇప్పుడు నా అప్పీల్ ఒక్కటే రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం చెప్పాలి అంటున్నారు న్యాయవాది సలీమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: