
పహల్గాంలో జరిగిన దాడికి భారత్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకే లో పీఓకేలో ఉగ్రశిభిరాలపై భారత్ మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ తో పాటుగా 20కి పైగా ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహించింది.
భారతదేశంలోని జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిపింది. దీంతో భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెట్టింది. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేసింది. భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. భారత్ అన్నీ విధాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పాకిస్థాన్ ఎన్నో విధాలుగా భారత్ ని ఓడించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకపోయింది.